18.1.20

మా ఆశ్రమంలో ధనుర్మాసం

మా ఆశ్రమంలో ధనుర్మాసం నెలరోజులు ఉదయాన్నే నగర సంకీర్తన చేసుకొని అందరిని మేల్కొలిపి ఆశ్రమానికి వస్తాము. తరవాత భక్తులందరూ కలసి తిరుప్పావై పారాయణం చేసి అనంతరం తీర్థప్రసాదాలు పుచ్చుకొని వెళతారు. ఇది ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం మా ఆశ్రమంలో జరిగే కార్యక్రమం. 

భోగి ముందురోజున గోదా రంగనాథులు తిరువీధికి వెళ్ళి గ్రామంలో ఉన్నవారినందరిని తమ కళ్యాణం చూసి తరించవలసిందిగా అందరినీ పిలుస్తారు. అదే సందర్భంలో గోదాదేవిని, రంగనాథస్వామిని వేరువేరు పల్లకీలపై ఊరేగిస్తూ ఒక పల్లకికి అడ్డుగా మరొక పల్లకిని అడ్డగించి ముందుకి వెళ్లనీకుండా చేస్తారు. అయ్యవారు అమ్మవారి గ్రామంలోకి ప్రవేశిస్తే వారిని గ్రామంలోకి రానీకుండా అమ్మవారి తరఫున వారు అడ్డుకుంటారు. ఇది ఒక కమనీయమైన వేడుక. అనంతరం అమ్మవారి గొప్పతనం. అయ్యవారి గొప్పతనం చెప్పుకుంటూ ఉంటారు. ఇరువురి తరఫున రెండు సమూహాలుగా జనాలు విడిపోయి సంభాషించుకుంటూ ఆనందిస్తారు.         

భోగి రోజున తెల్లవారుఝామునే అందరూ వచ్చి భోగిమంటలు వేసి పాటలు పాడుకొని, తీర్థప్రసాదాలు పుచ్చుకుంటారు. తరవాత గోదా రంగనాథులకి వైభవంగా కళ్యాణం జరిపిస్తాము. 

భోగి రోజున సాయంత్రం కొత్త వడ్లు(ధాన్యం)ని రోకలిలో వేసి దంచి, పొట్టు తీసి బియ్యాన్ని చేసి సంక్రాతి రోజున కొత్త బియ్యంతో దంపతులు అందరూ వచ్చి పరమాన్నం(పాయసం) చేసి, భగవంతునికి నివేదన చేసి వారి వారి ఇళ్ళకి తీసుకొని వెళతారు. 

         

No comments:

Post a Comment