31.1.20

ప్రతిష్టకి కరపత్రముల నమూనా

ప్రతిష్టకి కరపత్రముల నమూనా 

శతాబ్దాల ఘన చరిత్ర  కలిగిన (కడప) 
రతనాల సీమ కీర్తి కిరీటంలో పొదగబడుతున్న 
మరో విలువైన కలికితురాయి 
భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి 
ఈ 81 అడుగుల శ్రీవేంకటేశ్వరుని సుందరమూర్తి 
ప్రతిష్టామహోత్సవ ఆహ్వానం   

జై శ్రీమన్నారాయణ 
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 
ఆలంఖానపల్లె గ్రామం (చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి కడపలో ఉన్న యతీసేవాశ్రమము నందు జరుగుచున్నది  
శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్టామహోత్సవ ఆహ్వానం. 
జరగబోవు కార్యక్రమముల వివరములు 

02-03-2020 సోమవారం నుండి 05-03-2020 గురువారం వరకు 
02-03-20202 
సా || 6.00 గం||లకు ఉత్సవ ఆరంభం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ 
6-30 ని.లకు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి వారి ప్రవచనము 
03-03-2020
ఉ || 9-00 గం||లకు అగ్నిప్రతిష్ఠ, ఛాయాధివాసం 
ఉ || 10-00 గం||లకు సామూహిక లక్ష్మీనారాయణ పూజ (సుమారు 5000 మంది సువాసినలతో)
సా || 6-30 ని||లకు శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి ప్రవచనము 
04-03-2020
ఉ || 9-00 గం||లకు నయనోన్మీళనం, స్నపనం 
ఉ || 10-00 గం||లకు దంపతి పూజ (1008 మంది దంపతులకు లక్ష్మీనారాయణ స్వరూపంగా అర్చన)
సా || 6-00 గం||లకు శ్రీమతే రామానుజాయ నమః అని జపిస్తూ 21 రోజులు 1008 మంది భగవతోత్తముల ఇండ్లలో విశేష అర్చనలు అందుకున్న 1008 కలశములు వేంకటేశ్వరుని పాదాల చెంత సమర్పణ. 
సా || 6-30 ని||లకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ప్రవచనము 
అనంతరం తడియారాధన 
05-03-2020
ఉ || 6-00 గం||ల నుండి 8-00 గం||ల వరకు 108 గ్రామాలలో విశేష అర్చనలు అందుకున్న దివ్య కలశములతో యతిరాజులకు(రామానుజులకు) అభిషేకం. 
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఉ || 9-45 ని||లకు చిన్న జీయర్ స్వామి వారి కరకమలములతో ప్రతిష్ఠ, కుంభ ప్రోక్షణ 
మ || 12-00 గం||లకు సమాశ్రయణములు (మంత్రోపదేశములు)                  
జిల్లా నలుమూలల నుండి ప్రతిష్టామహోత్సవమునకు విచ్చేయుచున్న భక్తులు (సుమారు లక్షమంది)కు విశేష అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.    

No comments:

Post a Comment