ప్రియ భగవత్ బంధువులారా రండి .....యతీసేవాశ్రమ వైభవాన్ని తిలకించండి. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో నిర్మితమైన విరాట్(అతిపెద్ద) 81 అడుగుల వేంకటేశ్వరుని సుందరమూర్తితో కూడిన దివ్య దేవాలయం. సువిశాలమైన గోశాల, యతీశ్వరుల పర్యటనలో విశ్రాంతి తీసుకోవలసివచ్చిన వారి ఆరాధనాది కార్యక్రమములకు సుందరమైన సంప్రదాయబద్దమైన తీర్థ సదనము, శ్రీవారి దర్శనార్ధమై దేశ నలుమూలల నుండి విచ్చేయు భక్తులకు ఉచిత వసతి సౌకర్యము, తదియారాధన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, ఆశ్రమ ప్రాకారంలో మహర్షులు, ఆళ్వారుల యొక్క దివ్యమూర్తులు, నిత్యం ప్రభాతసేవ నుండి రాత్రి ఏకాంతసేవ వరకు శ్రీపాంచరాత్ర ఆగమ విధానంతో ఆరాధనలు, ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో పెద్దలు, పండితుల యొక్క అమృత భాషణములు, భాగవతోత్తములకు సేవలను అందించడానికి, ఆధ్యాత్మిక శోభలను పెంపొందించటానికి వైదిక ధర్మ పరిరక్షణ కొరకు సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అపర రామానుజావతారులు శ్రీమత్ పరమ హంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి కరకమలములతో ప్రారంభోత్సవమునకై ఎదురు చూచుచున్న దివ్య భవ్య క్షేత్రం మా ఈ యతిసేవాశ్రమము. ఆచార్యుల రాకకై ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న వేలాది మంది భాగవతోత్తముల సంకల్పం నెరవేరబోయే రోజు ఆసన్నమైనందుకు ఎంతో ఆనందిస్తూ, ఈ ఆనందోత్సవంలో మీరందరూ కూడా పాల్గొని ఆనందించి తరించగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ
ఆచార్య పాద దాసుడు
ఐ. వి. వేదవ్యాసాచార్యులు
No comments:
Post a Comment