28.2.20
25.2.20
21.2.20
యతీసేవాశ్రమ వైభవo
ప్రియ భగవత్ బంధువులారా రండి .....యతీసేవాశ్రమ వైభవాన్ని తిలకించండి. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో నిర్మితమైన విరాట్(అతిపెద్ద) 81 అడుగుల వేంకటేశ్వరుని సుందరమూర్తితో కూడిన దివ్య దేవాలయం. సువిశాలమైన గోశాల, యతీశ్వరుల పర్యటనలో విశ్రాంతి తీసుకోవలసివచ్చిన వారి ఆరాధనాది కార్యక్రమములకు సుందరమైన సంప్రదాయబద్దమైన తీర్థ సదనము, శ్రీవారి దర్శనార్ధమై దేశ నలుమూలల నుండి విచ్చేయు భక్తులకు ఉచిత వసతి సౌకర్యము, తదియారాధన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, ఆశ్రమ ప్రాకారంలో మహర్షులు, ఆళ్వారుల యొక్క దివ్యమూర్తులు, నిత్యం ప్రభాతసేవ నుండి రాత్రి ఏకాంతసేవ వరకు శ్రీపాంచరాత్ర ఆగమ విధానంతో ఆరాధనలు, ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో పెద్దలు, పండితుల యొక్క అమృత భాషణములు, భాగవతోత్తములకు సేవలను అందించడానికి, ఆధ్యాత్మిక శోభలను పెంపొందించటానికి వైదిక ధర్మ పరిరక్షణ కొరకు సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అపర రామానుజావతారులు శ్రీమత్ పరమ హంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి కరకమలములతో ప్రారంభోత్సవమునకై ఎదురు చూచుచున్న దివ్య భవ్య క్షేత్రం మా ఈ యతిసేవాశ్రమము. ఆచార్యుల రాకకై ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న వేలాది మంది భాగవతోత్తముల సంకల్పం నెరవేరబోయే రోజు ఆసన్నమైనందుకు ఎంతో ఆనందిస్తూ, ఈ ఆనందోత్సవంలో మీరందరూ కూడా పాల్గొని ఆనందించి తరించగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ
ఆచార్య పాద దాసుడు
ఐ. వి. వేదవ్యాసాచార్యులు
4.2.20
విగ్రహ ప్రతిష్ట యొక్క కరపత్రములు
81 అడుగుల వేంకటేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ట యొక్క కరపత్రములు
జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ
ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయింది. 81 అడుగుల వెంకన్నస్వామివారి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడా అని అందరూ ఎదురు చూసాం. ఇన్నాళ్ళకి విగ్రహావిష్కరణ జరగబోతోంది.
కడప జిల్లాలో ఆలంఖానపల్లెలో ఉన్న యతీసేవాశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో మార్చ్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగబోతున్నాయి. ఇది భగవంతుని కార్యక్రమం గనుక అందరూ పెద్దలే, అందరూ ఆహ్వానితులే.
భారతదేశం మొత్తంమీద ఎన్నో భగవంతుని భారీ, ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. కానీ శ్రీవెంకటేశ్వరస్వామివారికి భారీ విగ్రహం ఎక్కడా లేదని నా అభిప్రాయం. అందుకనే ఇక్కడ ప్రతిష్ఠించేదే మొట్టమొదటి వెంకన్న స్వామి వారి ఎత్తైన విగ్రహం.
కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకన్నని ఆకాశమంత ఎత్తులో దర్శించుకుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో చవిచూడాలంటే ఎవ్వరైనా ఈ ఆలంఖానపల్లె వెళ్ళాల్సిందే.
ఈ ఆశ్రమంలోనికి వెళ్ళాలంటే ముందుగా కొంతమంది ఋషులని, ఆళ్వారులని దర్శించేకే ఆశ్రమంలో అడుగుపెట్టడం జరుగుతుంది.
ఈ వెంకన్నస్వామి చుట్టూ సుమారుగా 200 గోవులతో కూడిన గోశాల ఉంది. అంటే గోవుల మధ్యలో గోవిందుడు ఉన్నాడన్నమాట.
ఈ ఆశ్రమంలోనికి వెళ్ళాలంటే ముందుగా కొంతమంది ఋషులని, ఆళ్వారులని దర్శించేకే ఆశ్రమంలో అడుగుపెట్టడం జరుగుతుంది.
నిర్మాణం జరుగుతున్నప్పటి చిత్రాలు ఈక్రింది లింకులో చూడండి
https://yatiseva.blogspot.com/2020/01/yatisevasramam-construction-photos.html
ఇంక నెల రోజులు వ్యవధి మాత్రమే ఉంది. ఈ నెలరోజులలో అన్నీ రంగులు దిద్దుకొని ముస్తాబు అవ్వాలి. అందుకే పనులు జోరుగా జరుగుతున్నాయి.
ఈ ఆశ్రమం కట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం
ఈరోజున మన భారతావని ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రంగా నిలిచింది అంటే అది ముఖ్యంగా వేద, వేదాంత, పురాణ, ఇతిహాస, ఆలయ, ఆధ్యాత్మిక శోభలను వ్యాప్తిచేసి, వాటి విలువలను పదిమందికి తెలియచేస్తూ ...... ప్రజలు ప్రేమాభిమానాలు, శాంతిసౌఖ్యాలతో ఆనందమయ జీవనం గడపటానికి..... మన పూర్వులు మహర్షులు యోగులు యొక్క అవిరామ కృషియే అందుకు కారణం. ముఖ్యంగా అర్చామూర్తి దర్శనం మనలో సాత్వికతను శాంతిని పెంపొందింపచేస్తుంది అనటంలో సందేహమేమీ లేదు. అటువంటి ప్రయత్నంలో భాగమే మా ఈ 81 అడుగుల శ్రీవెంకటేశ్వరస్వామి వారి సుందరమూర్తి స్థాపన.
మారుతున్న దేశకాలమాన పారిస్థుతులకు అనుగుణంగా ఆలయ వ్యవస్థను కూడా మార్చాలనే ఆలోచనే ఇది. ఆహ్లాదకరమైన ఉద్యానవనాలతో కూడి ఇదేదో పెద్దగా, వింతగా, గొప్పగా ఉంది ఒక్కసారి దానిని చూద్దాం అనైనా అటుగా వస్తే చాలు అని మా ఆశ. ఒక్కమారు కలిగిన ఆ దర్శనమే వారిలోని మార్పుకి నాంది అవుతుంది అనటంలో అతిశయోక్తి లేదేమో అని మాకు అనిపించింది.
దీనిని రెండు అంతస్థులుగా రూపొందించారు. గోసంరక్షణే సర్వలోక రక్షణగా భావించి పైభాగంలో 81 అడుగుల గోవిందునితో కూడి గోశాల నిర్మాణం, దిగువున తిరుమల లేక దివ్యక్షేత్రాలు సందర్శించటానికి ప్రయాణించే యాత్రికులకు ..... పూర్వపు రోజులు (మఠాలు, సత్రములు) జ్ఞప్తికి వచ్చేట్లుగా సేదతీరేటట్టుగా, వసతి సౌకర్యం కల్పించటం మా లక్ష్యం. ఎవరైనా ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అంటే ముందుగా మాకు తెలియపరచి రావలసిందిగా మనవి చేస్తున్నాం.
ఈ విధంగా 2007 నుండి ఈ మా ప్రయత్నం ప్రారంభించాం.
జై శ్రీమన్నారాయణ ..... అందరూ ఆహ్వానితులే ... అందరికీ ఇదే మా ఆహ్వానం
Subscribe to:
Posts (Atom)