మరుసటిరోజు అనగా 16/07/2019 నాడు పౌర్ణమిరోజున ఆశ్రమంలో ఉన్న వెంకన్నస్వామికి అభిషేకం జరిగింది. ఆశ్రమంలో ప్రతీ నెలా పౌర్ణమికి ఉదయంపూట స్వామికి అభిషేకం, (ప్రతిఒక్కరూ తమ స్వహస్తాలతో స్వామికి అభిషేకం చేసుకోవచ్చును.) మధ్యాహ్నం అన్నదానం జరుగుతూ ఉంటుంది.
ఆషాడ పౌర్ణమి - గురుపౌర్ణమి సందర్భంగా .... బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బ్రాహ్మణపల్లి చంద్రమౌళీశర్మ స్వామివారికి గురుపూజ చేసారు.
(ఈతను రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు. ఎందరో బ్రాహ్మణకుమారులకు ఉచితంగా వైదిక విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక ఉద్యమాలు, ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞయాగాలు, క్రతువులు నిర్వహించి ఎందరో పీఠాధిపతుల మన్ననలు పొంది, గత 30 సంవత్సరాలుగా కడప, గడ్డిబజారు వీధి, సోమసుందరేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా సేవలు అందిస్తున్న మహనీయులు వీరు)
No comments:
Post a Comment