26.7.19

కడపలో 81 అడుగుల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ప్రాజెక్ట్ వివరములు

భారతదేశ చరిత్రలోనే కడపలో ప్రప్రథమం 81 అడుగుల శ్రీవెంకటేశ్వరస్వామి వారి సుందర మూర్తి.

2016 రథసప్తమి రోజున ఈ భారీ ప్రాజెక్ట్ ని ప్రారంభించినాము.

ఇంటింటా భిక్షాటన చేసి నిర్మాణం చేయాలని మా సంకల్పం. 







సుమారు రెండు సంవత్సరములకు పైగా 600 పైచిలుకు పట్టణములు మరియు గ్రామములు తిరిగి భిక్షాటన చేసాము. 



ఇప్పటి వరకు 40% పనులు భిక్షతనతో వచ్చిన ద్రవ్యంతోను మరో 40% పనులు దాతలు వారికివారుగా మనస్ఫూర్తిగా ఏ పేరు ప్రఖ్యాతలు ఆశించకుండా సమర్పించిన ద్రవ్యంతో పూర్తిచేసాం. 


ఇక చివరి దశకు వచ్చేసరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటు ధార్మిక గుణసంపన్నుల ప్రోత్సాహము ఆర్థిస్తున్నాము.


గమనిక:౼ మా ముఖ్య ఉద్దేశ్యం భగవంతుని ముందు అందరూ సమానమే. దయచేసి దానం చేయు దాతలు మరల ఆలయ మర్యాదను ఆశించరు అని భావిస్తున్నాం.

Bhagavatha Sevasadanam Rushivatika
A/C No.32860319510
IFSC CODE : SBI N0015248
PH NO....9985155184...9948137927

17.7.19

2019 Gurupujala Photos

2019 Gurupujala Photos (Kadapa)

2019 జూలై నెలలో ఆషాడపౌర్ణమి గురుపౌర్ణమి సందర్భంగా మా ఆశ్రమంలో జరిగిన కార్యక్రమాల వివరాలు మరియు చిత్రాలు.  



















శ్రీమతి తులశమ్మగారికి సువాసిని పూజ 









సువాసిని పూజ అనంతరం కొమ్మూరు ఉమాప్రసాద్ గారిచే భక్తిరంజని భక్తిగీతాలాపన జరిగింది 




మరుసటిరోజు పౌర్ణమిరోజున ఆశ్రమంలో ఉన్న వెంకన్నస్వామికి అభిషేకం జరిగింది.  ఆశ్రమంలో ప్రతీ పౌర్ణమికి ఉదయంపూట స్వామికి అభిషేకం, మధ్యాహ్నం అన్నదానం జరుగుతూ ఉంటుంది.  ప్రతిఒక్కరూ తమ స్వహస్తాలతో స్వామికి అభిషేకం చేసుకోవచ్చును.  












ఆషాడ పౌర్ణమి - గురుపౌర్ణమి సందర్భంగా .... బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బ్రాహ్మణపల్లి చంద్రమౌళీశర్మ స్వామివారికి గురుపూజ చేసారు. 
(ఈతను రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు. ఎందరో బ్రాహ్మణకుమారులకు ఉచితంగా వైదిక విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక ఉద్యమాలు, ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞయాగాలు, క్రతువులు నిర్వహించి ఎందరో పీఠాధిపతుల మన్ననలు పొంది, గత 30 సంవత్సరాలుగా కడప, గడ్డిబజారు వీధి, సోమసుందరేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా సేవలు అందిస్తున్న మహనీయులు వీరు)