యతిసేవాశ్రమం కడప వారు నిర్వహించు
శ్రీ భూనీళా సమేత శ్రీ శ్రీనివాసుని కల్యాణ మహోత్సవ ఆహ్వానం
ఈ సంవత్సరం పేరు విళంబి అని అంటారు. ప్రభవాది 60 సంవత్సరాలలో కెల్లా ఈ సంవత్సరం చాలా విశేషమైనది అని పెద్దలు చెప్పేవారు. కారణం కలియుగ నాయకుడైన శ్రీవేంకటేశ్వరునికి ఈ విళంబినామ సంవత్సరంలోనే కల్యాణమైనది అని పురాణ వాక్కు. పూర్వం ఈ విళంబి సంవత్సరం వస్తే మహారాజులు, జమీందారులు, గ్రామ పెద్దలు, ఆలయ ధర్మకర్తలు ఇలా అందరూ కలసి మన తెలుగునాట సంవత్సరమంతా వైభవంగా శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తూ ఉండేవారట.
కానీ రానురాను ఈ వైభవం పూర్తిగా తగ్గుతూ వచ్చింది. మరల గోవిందుని విళంబినామ సంవత్సర కళ్యాణ వైభవాన్ని రానున్న తరాలకు అందించాలని మా ఆచార్యుల సంకల్పం. దానిలో భాగంగానే కడపలో ఉన్న మా యతీసేవాశ్రమం నుండి ఈ కళ్యాణ వేడుకలను గత శ్రావణ మాసంలో ప్రారంభించి సుమారు 8 జిల్లాలలో 90 కల్యాణాల వరకు పూర్తి చేసుకొని అంతటా ప్రచారం చేస్తూ ఈనెల కార్తీక పౌర్ణమి నాటికి మీ విశాఖ జిల్లాకి చేరుకుంటున్నాం. డిశంబరు 7 తారీఖు వరకు విశాఖలోని ఆయా ప్రాంతాలలో కళ్యాణాలు నిర్వహించాలని మా ప్రయత్నం.
భాగవతోత్తములు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీమీ ప్రాంతాలలో శ్రీనివాసకళ్యాణం జరిపించుకోవటం కానీ, దర్శించటం కానీ లేక నిర్వహించేవారిని ప్రోత్సహించడంగానీ చేయగలరని ప్రార్థిస్తూ,
ఇట్లు
వ్యవస్థాపకులు
యతిసేవాశ్రమం-కడప
9985155184
కార్యక్రమ నిర్వాహకులు
L.శ్రీధర్ గారు (Vice Chairman) యతిసేవాశ్రమం
7382881111
వెంకట్రావు గారు (General Secretary) యతిసేవాశ్రమం
7013299828
No comments:
Post a Comment